లోక్‌సత్తా నేత డాక్టర్ జయప్రకాష్ నారాయణకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొట్టింది. కారు టైరు పేలటం వల్ల కారు వెనుకబాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో కారులో జేపీతోపాటు వైబీఐ అధ్యక్షుడు మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. కానీ ప్రమాదానికి కారణమైన ఆటోలో ఉన్న మహిళా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
జూబ్లీ చెక్‌పోస్ట్ వద్ద జేపీకి తప్పిన ప్రమాదం - JP Car Accident
లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్‌కు ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం ఆయన కారులో వెళ్తుండగా.. హైదరాబాద్‌లోని జూబ్లీ చెక్‌పోస్ట్ దగ్గర.. కారును ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
జూబ్లీ చెక్‌పోస్ట్ వద్ద జేపీకి తప్పిన ప్రమాదం
ఉదయం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతున్న జయప్రకాష్ నారాయణ కారు జూబ్లీ చెక్‌పోస్టు కూడలి వద్ద సిగ్నల్ పడటం వల్ల కారును ఆపివేశారు. అయితే ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆటో వీరి కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం కారణంగా దాదాపు అరగంటపాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు చేరుకుని రాకపోకలను క్రమబద్ధీకరించారు.
TAGGED:
JP Car Accident