Janasena, Telangana Election Results 2023 Live : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోజనసేన పత్తా లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగిన ఆ పార్టీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేస్తే అన్నిచోట్లా ఓటమి పాలైంది. ఆ పార్టీ తరఫున బరిలో దిగిన అభ్యర్థులందరూ డిపాజిట్‌లు కోల్పోయారు.
Telangana Election Results 2023 Live :ఈసారి భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా 11 స్థానాల్లో పోటీ చేయాలని తొలుత భావించిన జనసేన, తర్వాత ఎనిమిది స్థానాలకే పరిమితమైంది. తాండూరు, కోదాడ, నాగర్ కర్నూల్, ఖమ్మం, కూకట్‌పల్లి, కొత్తగూడెం, వైరా(ఎస్టీ), అశ్వారావుపేట(ఎస్టీ) స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో నాలుగు స్థానాలు ఖమ్మం జిల్లాలోనే ఉండగా, మిగిలిన నాలుగు వేర్వేరు జిల్లాల్లో ఉన్నాయి. వారి తరఫున వివిధ నియోజకవర్గాలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, కూకట్‌పల్లిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేశారు. కాగా అన్ని స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. కూకట్‌పల్లి అభ్యర్థి మూమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌కు మాత్రం 39,830 ఓట్లు రాగా, మిగిలిన 7 స్థానాల్లో ఐదు వేల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
8 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి వచ్చిన ఓట్ల వివరాలు :
క్రమ సంఖ్య | పోటీ చేసిన నియోజకవర్గం పేరు | వచ్చిన ఓట్లు |
1 | తాండూరు | 4,087 |
2 | కోదాడ | 2,151 |
3 | నాగర్ కర్నూల్ | 1,955 |
4 | ఖమ్మం | 3,053 |
5 | వైరా | 2,712 |
6 | కొత్తగూడెం | 1,945 |
7 | అశ్వారావుపేట | 2,281 |
8 | కూకట్‌పల్లి | 39,830 |
Janasena BJP Alliance In Telangana Elections :అయితే జనసేన ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ప్రభావం చూపలేదు. ఒక్క కూకట్‌పల్లిలో మాత్రమే ఓ మోస్తరు ఓట్లు సంపాదించింది. అక్కడ కూడా మూడో స్థానానికే పరిమితమైంది. మిగిలిన 7 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసి ఎనిమిదికి 8 స్థానాలు గెలిచి కింగ్ మేకర్ అవ్వాలని కలలు కన్నారు. కానీ, అది కలగానే మిగిలిపోయింది. తెలంగాణ ఓటర్లు గాజు గ్లాస్‌ను తిప్పికొట్టారు.
పదేళ్ల పాటు జగన్‌ను రాజకీయాల వైపు చూడకుండా చేయాలి: పవన్ కల్యాణ్
Kukatpally Election Results 2023 :ముఖ్యంగా కూకట్‌పల్లిలో ఆంధ్రాసెటిలర్స్ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో అక్కడ జనసేన తరఫున బరిలో దిగిన ప్రేమ్‌కుమార్ గెలుస్తారని ధీమా ఉంది. అయితే అక్కడ హస్తం హవాలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 64 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయఢంకా మోగించారు. దీంతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా, జనసేన మూడో స్థానానికి పడిపోయింది. గెలుస్తుందనుకున్న ఈ నియోజకవర్గంలో కూడా పవన్ కల్యాణ్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
తెలంగాణలో బరిలో నిలిచిన జనసేన అభ్యర్థులు వీళ్లే :
1. కోదాడ - మేకల సతీష్ రెడ్డి