JanaSena Contest in 32 Seats in Telangana :వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు జనసేన పార్టీ(Janasena Party) ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలోని 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడమే లక్ష్యంగా మహిళలు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ.. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు.
Janasena Pawan: వాలంటీర్లకు షాక్.. పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదును వాపసు చేసిన న్యాయస్థానం
పోటీ విషయమై ఐదు రోజుల కిందట తమ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి తొమ్మిదేళ్లలో జనసేన పార్టీతెలంగాణలో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోందని పేర్కొన్న మహేందర్ రెడ్డి.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించి జనసేన పార్టీ తమ బలాన్ని చాటుకుందన్నారు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఏ పార్టీతో పొత్తు ఉండదని ఇక్కడి నేతలు స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగు దేశంతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఇటీవలే ప్రకటించారు. అయితే తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి వెల్లడించారు.
Janasena Contest Assembly constituencies :మూడునెలల ముందు నుంచే 32 నియోజకవర్గాలకు బాధ్యులను నియమించి పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. జనసేన పోటీ చేస్తున్న స్థానాలు.. జీహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజిగిరి, కూకట్పల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, సనత్‌నగర్, ఉప్పల్ నియోజకవర్గాలతోపాటు నాగర్ కర్నూలు, వైరా, ఖమ్మం, మునుగోడు, కొత్తగూడెం, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్ నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లెందు, మధిర నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు మహేందర్ రెడ్డి ప్రకటించారు.
ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల సమయానికి మార్పులుంటే పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచిస్తారని తెలిపారు. త్వరలోనే తెలంగాణలో పవన్‌కల్యాణ్ వారాహి యాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ యాత్ర కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరుగుతోంది.
Telangana Congress MLA Candidates List 2023 : ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు.. మరో వారంలో జాబితా
TDP Protests in Hyderabad : చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో దీక్ష