ఆధ్యాత్మిక నగరం... ప్లాస్టిక్రహితం.. రాష్ట్రంలో ప్రముఖ అధ్యాత్మిక కేంద్రమైన తిరుమలలో ప్లాస్టిక్ నిషేధంపై చర్యలు తీసుకుంటోంది అధికార యంత్రాంగం. అసాధ్యమని నగరవాసులంతా భావించినా...సుసాధ్యం చేసే దిశగా అడుగులు వేసింది. దశల వారీగా ప్లాస్టిక్ నిషేధంపై స్పష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్లింది. ఫలితంగా నేడు తిరుపతిలో గణనీయంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గింది.
గాంధీ జయంతి నాడే శ్రీకారం...
3.5 లక్షలమంది నగర జనాభాతోపాటు... రోజుకు లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు.వీరంతా వాడిపడేసిన ప్లాస్టిక్‌తో తిరుపతి నగరం కాలుష్య వలలో చిక్కుకుంది. దీనిని ఆరికట్టేందుకు 'గాంధీజయంతి' సందర్భంగా 2018 అక్టోబర్2న ప్లాస్టిక్‌ను నిషేధించాలని తిరుపతి నగర పాలక సంస్థ నిర్ణయించింది. ప్రజల్లో అగాహన కల్పించేలా.. స్కూల్లు, కాలేజీలు, పురవీధుల్లో ప్లాస్టిక్‌పై ర్యాలీలు నిర్వహించారు. ప్లాస్టిక్ భూతం వల్ల కలిగే నష్టాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పారు.
'ప్లాస్టిక్ బహిష్కరణ జయభేరి పేరుతో'
ఈ కార్యక్రమానికి 'ప్లాస్టిక్ బహిష్కరణ జయభేరి' అనే పేరుతో నాంది పలికింది నగర పాలక సంస్థ. అంతే ఏడాది తిరిగేసరికి ప్రజల్లో చైతన్యం పెరిగింది. ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా తగ్గింది. ప్రజలు తమ గృహాల్లో ఉన్న ప్లాస్టిక్ సంచులను నగరపాలక సంస్థకు ఇవ్వగా.. రీసైక్లింగ్ చేశారు.
ప్రత్యామ్నాయాలు ఇలాగా..!
ప్లాస్టిక్‌ను నిషేధించిన తరువాత వాటి స్థానంలో ప్రత్యామ్నాయాల అవసరం ఏర్పడింది. నగర పాలకసంస్థ ఈ బాధ్యతను స్వయం ఉపాధి మహిళా బృందాలకు అప్పగించింది. పేపర్, ఫైబర్, బట్టలతో ప్లాస్టిక్ రహిత సంచులను తయారు చేయించింది. ఈ నిర్ణయంతో ప్లాస్టిక్ వినియోగం తగ్గటమే కాదు..మహిళా సంఘాలకు ఉపాధి దొరికింది.
ప్రసాదం కౌంటర్లో అందజేత
ప్రత్యేకంగా తయారు చేసిన సంచులనే తిరమల తిరుపతి దేవస్థానంలోని ప్రసాదం కౌంటర్లో కూడా విక్రయిస్తున్నారు. రెండు కౌంటర్లలో ఈ ప్రత్యేక సంచులను భక్తులకు అందజేస్తున్నారు.
పర్యారణ పరిరక్షణకు కృషి చేస్తూ...ప్లాస్టిక్ ను పాతరేసే దిశగా మొదటిగా అడుగేసిన అధ్యాత్మిక నగరి తిరుపతిపై దేశం నలుమూలల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.
ఇదీ చూడండిశ్రీవారిని దర్శించుకున్న జనసేన నేత నాదెండ్ల