మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మరణం తమ కుటుంబానికి తీరని లోటని ఆయన సోదరుడు పద్మారెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులందరూ క్రమశిక్షణగా మెలగడానికి కారణం ఆయనేనని పేర్కొన్నారు. ఆయన ఎప్పుడూ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించలేదని, అది తప్పని జైపాల్ రెడ్డి అభిప్రాయ పడేవారని పద్మారెడ్డి వెల్లడించారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే మేము ఆయనకు అండగా నిలిచేవారమని గుర్తు చేసుకున్నారు.
' జైపాల్ అన్న... కుటుంబ రాజకీయాలు తప్పనే వారు' - CONGRESS SENIOR LEADER
"మా సోదరుడు జైపాల్ రెడ్డి ఎప్పుడూ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించలేదు. అది తప్పని ఆయన అభిప్రాయ పడేవారు": పద్మారెడ్డి, జైపాల్ రెడ్డి సోదరుడు
'కుటుంబ రాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదు'