రాష్ట్రంలో కేసీఆర్ పాలన కంటే ఏపీలో జగన్ పాలన బాగుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు. జగన్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదని చెప్పారని...తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. గవర్నర్ పదవిని పొడిగించకుండా మంచి పని చేశారని...రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఆయన రాష్ట్ర సమస్యలపై స్పందించలేదన్నారు. రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం లేకుండా మరో పార్టీ నుంచి తెరాసలో చేరిన వారి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడమేంటని నిలదీశారు.
"కేసీఆర్ కంటే.. ఏపీ సీఎం జగన్‌ది ఉత్తమ పాలన" - రాజ్యాంగం
తెలంగాణలో కేసీఆర్ పాలన కంటే ఏపీలో జగన్ పాలన బాగుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు.
కేసీఆర్ కన్నా జగన్ బెస్ట్ : భట్టి