తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్​ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో పీఆర్​సీ

Jagadish Reddy assured PRC for electricity employees: వేసవికాలంలో విద్యుత్​ ఉద్యోగులకు చల్లటి కబురు అందింది. విద్యుత్​ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ త్వరలో పీఆర్​సీ కల్పించబోతునట్లు విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్​తో చర్చించనున్నట్లు తెలిపారు.

విద్యుత్​ ఉద్యోగులకు త్వరలో పీఆర్​సీ
విద్యుత్​ ఉద్యోగులకు త్వరలో పీఆర్​సీ

By

Published : Feb 25, 2023, 7:40 PM IST

Jagadish Reddy assured PRC for electricity employees: విద్యుత్ ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీ ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ ​రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖమంత్రి జగదీశ్​ రెడ్డితోపాటు ట్రాన్స్‌కో జెన్​కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్​ఎస్పీడిసిఎల్‌ సీఎండీ రఘురమారెడ్డిలను విద్యుత్ జేఏసీ నాయకులు కలిశారు.

పీఆర్సీ ప్రకటించాలని జేఏసీ నేతలు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. జేఏసీ నేతల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వారం రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని మంత్రి జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు. పీఆర్సీపై మంత్రి సానుకూలంగా స్పందించడంతో జేఏసీ నేతలు సీఎం కేసీఆర్, మంత్రి జగధీశ్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్​రావు, రఘురమారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ ఛైర్మన్ కె ప్రకాష్, కన్వీనర్ ఎన్​ శివాజీ, వైస్ ఛైర్మన్ అంజయ్యలు పాల్గొన్నారు.

48 గంటల్లోగా బాగు చేసి బిగించాలి:

ఎక్కడైనా విద్యుత్‌ పంపిణీ నియంత్రిక కాలినా, పాడయినా దానిని 48 గంటల్లోగా బాగు చేసి బిగించాలి. అలా చేయలేకపోతే ఆ ట్రాన్స్​ఫార్మర్​ పరిధిలో విద్యుత్​ కనెక్షన్‌ ఉన్న వినియోగదారులకు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున చెల్లించాలి. ఈ సొమ్మును విద్యుత్‌ పంపిణీ నియంత్రిక పరిధి విద్యుత్‌ సిబ్బందికి జరిమానాగా విధించి, వారి జీతాల నుంచి వినియోగదారులకు చెల్లించాలి అని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌ శ్రీరంగారావు ఆదేశించారు.

రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థల ఆదాయ, వ్యయాలపై వచ్చే ఏడాది(2023-24)కి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక, 2016-22 మధ్య పెరిగిన ఖర్చులపై ఈ సంస్థలిచ్చిన ట్రూఅప్‌ ఛార్జీల నివేదికలపై శుక్రవారం జెన్‌కో సమావేశమందిరంలో ఈఆర్‌సీ వినియోగదారులతో సమావేశం నిర్వహించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details