తెలంగాణ

telangana

ETV Bharat / state

మాదిగలకు మంత్రివర్గంలో చోటుకల్పించకపోవడం బాధాకరం

నూతన మంత్రి వర్గంలో తమకు చోటు కల్పించకపోవడం అవమానించినట్లేనని ఎమ్మార్పీస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య అన్నారు. హైదరాబాద్ ఓయూలో జరిగిన మీడియా సమావేశంలో తెరాసా ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేసిందని ఆరోపించారు.

మాదిగలకు మంత్రివర్గంలో చోటుకల్పించకపోవడం బాధాకరం

By

Published : Sep 11, 2019, 9:17 AM IST

హైదరాబాద్ ఓయూ అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో తెరాస ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తుందని ఎమ్మార్పీస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర జనాభాలో 18% ఉన్న తమ జాతికి నూతన మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తెరాస అధికారంలోకి రావడంలో మాదిగలు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. గతంలో డప్పు-చెప్పుకు రెండు వేల పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేశారని దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల14 వరకు ముఖ్యమంత్రికి, మంత్రులకు వినతి పత్రాలు అందచేస్తామని తెలిపారు. ఇచ్చిన వాగ్దానాలపై స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

మాదిగలకు మంత్రివర్గంలో చోటుకల్పించకపోవడం బాధాకరం

ABOUT THE AUTHOR

...view details