IT Raids on Hetero: హెటిరో డ్రగ్స్ కార్యాలయంతో పాటు ప్రొడక్షన్ కేంద్రాల్లో సోదాలు
09:05 October 06
హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఐటీశాఖ దాడులు
హైదరాబాద్లోని హెటిరో డ్రగ్స్ సంస్థల (Hetero Drugs Companies)పై ఐటీ దాడులు (IT Raids) జరుగుతున్నాయి. కార్పొరేట్ కార్యాలయంతో పాటు ప్రొడక్షన్ కేంద్రాల్లో అధికారులు సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు. వీటితో పాటు హెటిరో డైరెక్టర్లు, సీఈవో కార్యాలయాలు, ఇళ్లలో ఐటీ అధికారులు (IT Raids) తనిఖీలు చేస్తున్నారు. 20 బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ దాడులను (IT Raids) చేపట్టారు.
సంస్థ చెల్లిస్తున్న ఆదాయపు పన్నుకు, ఆ సంస్థ వ్యాపార లాదేవీలకు వ్యత్యాసం ఉండడంతో తనిఖీలు (IT Raids)నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హెటిరో సంస్థకు చెందిన దస్త్రాలను పూర్తిగా పరిశీలన చేసిన తరువాతనే... వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని ఐటీ అధికారి ఒకరు తెలిపారు. బుధవారం, గురువారం కూడా ఈ సోదాలు (IT Raids) కొనసాగే అవకాశం ఉందని వివరించారు.