తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారులు, గుత్తేదారుల అక్రమ లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ దర్యాఫ్తు విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. బినామీ పేర్లతో వ్యాపారాలు చేస్తున్న సంస్థల్లో ఆ శాఖ అధికారులు సోదాలు జరిపారు. రెండు వారాల్లో వివిధ సంస్థల నుంచి రూ.6 కోట్లు లెక్కల్లో చూపని నగదును ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది.
పదిశాతం వ్యాపారానికే పన్ను
గత కొంతకాలంగా పలు సంస్థలు బినామీ పేర్లతో నిర్వహిస్తున్న వ్యాపారాల వివరాలు.. చెల్లిస్తున్న పన్నులను అధికారులు బేరీజు వేసి చూస్తున్నారు. వీటిల్లో పదో వంతు లావాదేవీలకు కూడా పన్నులు చెల్లించడం లేదని గుర్తించారు. ఇప్పుడు వారికి పన్ను చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారు.
వాస్తవ విలువలోనూ గోల్మాల్
స్థిరాస్తి వాస్తవ విలువలో నాలుగో వంతు మాత్రమే రికార్డుల్లో చూపిస్తున్నారని.. అధికారులు గుర్తించారు. ఇలాంటి లావాదేవీలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు తనిఖీలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు.
అక్రమ లావాదేవీలపై ఐటీ కన్ను - business
బినామీ పేర్లతో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్న సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. పన్ను ఎగవేతకు పాల్పడుతున్న సంస్థల వివరాలు తెలుసుకుని నోటీసులు పంపిస్తోంది.
ఐటీ అధికారుల సోదాలు
ఇదీ చదవండి: 'ఫ్లైఓవర్‌పై రయ్..రయ్..'