ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై సోమవారం ఫిక్కీ పోస్ట్ బడ్జెట్ అనాలిసిస్ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మాజీ సలహాదారు మోహన్ గురుస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బడ్జెట్‌లో పేర్కొన్న అంశాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విశ్లేషించారు. మౌలిక వసతులకు రూ. లక్ష కోట్లకుపైగా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటన చేశారని...దానిని ఏ విధంగా సమకూర్చుకుంటారో ఎక్కడా తెలియజేయలేదని పేర్కొన్నారు. రైతులకు ఏడాదికి రూ. ఆరువేలు ఇవ్వడం కంటే ప్రాజెక్టులు నిర్మాణం చేయడం ద్వారా శాశ్వత ప్రయోజనాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి సమగ్ర విధానం తీసుకురావాల్సి ఉందన్న ఆయన... కేంద్ర ప్రభుత్వానికి నిధులు సమకూర్చుకోడానికి వేరేదారి లేకనే పెట్రోల్, డీజిల్‌పై సుంకాలను పెంచిందన్నారు. బ్యాంకులను బలోపేతం చేసేందుకు రూ.లక్షా యాభైవేల కోట్లు అవసరం కాగా కేవలం 70వేల కోట్లు మాత్రమే కేటాయించిందని మండిపడ్డారు.
బడ్జెట్‌పై ఫిక్కీ సమావేశంలో ఆర్థిక పెద్దల పెదవి విరుపు - mohan guranath swamy
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఫిక్కీ సమావేశంలో పాల్గొన్న వక్తలు పెదవి విరిచారు. బడ్జెట్‌లో రూపాయి వచ్చే విధానం గురించి ఎక్కడా ప్రస్తావించకపోగా... ఖర్చు పెట్టే విధానం గురించి చెప్పారంటూ అభిప్రాయపడ్డారు.
బడ్జెట్‌పై ఫిక్కీ సమావేశంలో ఆర్థిక పెద్దల పెదవి విరుపు
ఇదీ చూడండి: టీఆర్టీ నియామక షెడ్యూలు విడుదల
Last Updated : Jul 9, 2019, 6:57 AM IST