తెలంగాణ

telangana

ETV Bharat / state

Interventional Pulmonology bronchus 2021: హెచ్​ఐసీసీలో పల్మనాలజీపై సదస్సు.. నూతన ఆవిష్కరణలపై చర్చ - interventional pulmonology bronchus 2021

హైదరాబాద్​ హెచ్​ఐసీసీలో ఇంటర్వెన్షనల్​ పల్మనాలజీపై అంతర్జాతీయ సదస్సు(Interventional Pulmonology bronchus 2021) జరుగుతోంది. యశోద ఆస్పత్రుల ఆధ్వర్యంలో 'బ్రాంకస్​- 2021' పేరిట రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్చువల్​గా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రఖ్యాత వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Interventional Pulmonology bronchus 2021
ఇంటర్వెన్షనల్​ పల్మనాలజీ బ్రాంకస్​ 2021

By

Published : Nov 27, 2021, 7:36 PM IST

Interventional Pulmonology bronchus 2021: హైదరాబాద్​ హెచ్​ఐసీసీలో యశోద ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ- బ్రాంకస్​ 2021 ద్వితీయ వార్షిక సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్చువల్​గా ప్రారంభించారు. "ది ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ(The future of interventional pulmonology)”అనే థీమ్‌తో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోంది.

సదస్సుకు హాజరైన వివిధ దేశాలకు చెందిన వైద్యులు

ప్రతి యేటా సదస్సు

అతిపెద్ద పల్మనాలజిస్టుల సమావేశాన్ని నిర్వహించడం పట్ల యశోద ఆస్పత్రుల(Interventional pulmonology bronchus 2021 by Yashoda hospitals) డైరెక్టర్​ డా. పవన్​ కుమార్​ హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్​ విపత్కర సమయాల్లో వైద్యులు చేసిన కృషికి ఇది నివాళి అని పేర్కొన్నారు. డా. పవన్​ కుమార్​ పల్మనాలజిస్ట్ కావడంతో.. యశోద ఆస్పత్రుల్లో శ్వాసకోశ సమస్యల పరిష్కారానికి అమలు చేస్తున్న కొత్త శిక్షణా పద్ధతులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అభివృద్ధి ప్రమాణాలపై చర్చించేందుకు ప్రతి సంవత్సరం ఈ సదస్సు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

STEAM: అతిగా ఆవిరి పట్టడం అనర్థం

విధానపరమైన నైపుణ్యాల కోసం

ఈ సదస్సులో వ్యాధి నిర్ధరణ, చికిత్సా విధానంలో కొత్తగా వచ్చిన ఆవిష్కరణలను చర్చించనున్నట్లు చెప్పారు. శిక్షణా కార్యక్రమాల ద్వారా రాబోయే పల్మనాలజిస్టులకు విధానపరమైన నైపుణ్యాలను అందించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కొవిడ్​ సమయంలో వివిధ దేశాల్లో ఈ రంగంలో వైద్యులు ఎదుర్కొన్న సవాళ్లు, ఆ సవాళ్లను అధిగమించడానికి అవసరమైన పద్ధతులు, రోబోటిక్ బ్రోంకోస్కోపీ, సురక్షిత పద్ధతులు వంటి ఆసక్తికరమైన అంశాలను నేడు చర్చించినట్లు వివరించారు.

వివిధ దేశాల నుంచి దాదాపు 1000 మందికిపైగా పల్మనాలజిస్టులు సదస్సుకు హాజరయ్యారు. ఆసియా వేదికగా జరుగుతున్న తొలి వైద్య సదస్సుగా “బ్రాంకస్- 2021” గుర్తింపు పొందటం గర్వకారణమని యశోద పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్​ హరికిషన్​ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత వైద్యులు డా. గుస్తావో కంబో నచెలి(అమెరికా), డాక్టర్. మిచెలా బెజ్జి(ఇటలీ), డాక్టర్. మునవ్వర్(యూకే), డాక్టర్ పల్లవ్ షా(యూకే), డాక్టర్. సారాబోర్న్(బంగ్లాదేశ్), డాక్టర్ కైల్ హోగార్త్(అమెరికా), డా. మైఖేల్ ప్రిట్‌చెట్ (అమెరికా) ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Harish rao review on covid: కొవిడ్ కొత్త వేరియంట్​పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్

ABOUT THE AUTHOR

...view details