తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం అంగీకరిస్తే రెండ్రోజుల్లో అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభిస్తాం.. - Teliconfarance at errammanjil on rtc services

హైదరాబాద్​ ఎర్రమంజిల్​లోని రోడ్లు భవనాల కార్యాలయంలో ఆర్టీసీ సీఎండీ సునీల్‌శర్మ... ఏపీఎస్​ ఆర్టీసీ అధికారులతో టెలికాన్పరెన్స్‌ ద్వారా అంతరాష్ట్ర సర్వీసులపై మాట్లాడారు.

సీఎం అంగీకరిస్తే ఒకటి రెండురోజుల్లో అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభం
సీఎం అంగీకరిస్తే ఒకటి రెండురోజుల్లో అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభం

By

Published : Oct 23, 2020, 4:19 PM IST

ఒకటి రెండ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర సర్వీసులపై ఆర్టీసీ చర్చలు కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. హైదరాబాద్​ ఎర్రమంజిల్​లోని రోడ్లు భవనాల కార్యాలయంలో ఆర్టీసీ సీఎండీ సునీల్‌శర్మ... ఏపీఎస్​ ఆర్టీసీ అధికారులతో టెలికాన్పరెన్స్‌ ద్వారా అంతరాష్ట్ర సర్వీసులపై మాట్లాడారు.

లక్షా‌ 60 వేల కిలోమీటర్లకు సంబంధించి రూట్‌మ్యాప్​ను ఇప్పటికే టీఎస్​ ఆర్టీసీకి... ఏపీఎస్​ ఆర్టీసీ పంపింది. ముఖ్యంగా హైదరాబాద్- విజయవాడ రూట్లపై స్పష్టత వస్తే రెండు, మూడురోజుల్లో రెండురాష్ట్రాల మధ్య చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య సర్వీసులకు సంబంధించిన దస్త్రం ప్రస్తుతం సీఎం కేసీఆర్​... వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం అంగీకరిస్తే ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి: ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహ డిశ్చార్జ్ పిటిషన్లు

ABOUT THE AUTHOR

...view details