conflicts in Telangana congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తెరపైకి వస్తున్నాయి. పైకి కలిసికట్టుగా పని చేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ సీనియర్ నాయకులకు టీపీసీసీ అధ్యక్షుడికి మధ్య ఉన్న అంతరం సమసి పోలేదని తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత ఇటీవల దిల్లీలో ఏఐసీసీ సమక్షంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో రాష్ట్ర నాయకుల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో పరిస్థితులను అంచనా వేసిన అధిష్ఠానం గట్టి చురకలు అంటించింది. విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పని చెయ్యాలని స్పష్టం చేసింది. గీత దాటితే వేటు తప్పదని హెచ్చరికలు కూడా చేసింది.
సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెప్పాలిగా..
jaggareddy on revanth reddy : అప్పటి నుంచి కొన్ని రోజులు నాయకులు ఐక్యంగానే పార్టీ కార్యక్రమాలల్లో పాల్గొన్నారు. నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తరచు బహిర్గతమవుతూనే ఉన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఒంటెద్దు పోకడతో ముందుకు వెళ్తున్నారని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం ఎర్రవెల్లిలో రైతు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు విషయంపై కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి విభేదించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా, తనకు తెలియకుండా రైతు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని జగ్గారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. పీఏసీ సమావేశంలో చర్చించిన తర్వాతనే పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జగ్గారెడ్డి స్పష్టం చేస్తున్నారు.
ఆ అధికారం నాకు ఉంది..