టీఏ, డీఏ రూ.300 చేయాలి
అధ్యాపకుల నిరసన, నిలిచిపోయిన ఇంటర్ మూల్యాంకనం - ఇంటర్ మూల్యాంకనం
ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకన ధరలు పెంచాలంటూ అధ్యాపకులు నిరసనకు దిగారు. టీఏ, డీఏలు పెంచాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడ జూనియర్ కళాశాలలో ఆందోళన నిర్వహించారు. ధర్నాతో మూల్యంకనం నిలిచిపోయింది.
ఇంటర్ మూల్యాంకనం
టీఏ, డీఏలను 300 రూపాయలకు పెంచాలని అధ్యాపకులు కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఏటికేడు పెంచుతున్నారని ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. సమస్యలు పరిష్కరించే వరకు రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి :టమోటాలతో హోలీ... ఎంతో బాగుంటుందో మరి