జూన్ 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. ఉదయం 9 గంటలకే పరీక్ష ప్రారంభమవుతున్నందున... 8 గంటల వరకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు, పరీక్షలు నిర్వహించే సిబ్బందికి తప్ప లోపలికి ఎవరినీ అనుమతించబోమని తేల్చి చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నందున పరీక్ష సమయంలో అక్కడికి ఎవరూ రావొద్దని, దగ్గర్లో ఉన్న జిరాక్సు సెంటర్లు మూసివేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 857 కేంద్రాల్లో... సుమారు 15 వేల 145 మంది సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అశోక్ వెల్లడించారు.
ఈనెల 7 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు - KARYADARSHI
ఈనెల 7 నుంచి ఈ నెల 14 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు మొదటి సంవత్సరం, 2 గంటల నుంచి 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలుంటాయని చెప్పారు.
రేపటి నుంచే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
Last Updated : Jun 5, 2019, 4:49 PM IST