TS Inter Results 2022: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు జూన్ 20వ తేదీలోపే వెల్లడికానున్నాయి. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు గురువారంతో ముగిశాయి. జవాబుపత్రాల మూల్యాంకనం ఈనెల 12న మొదలైంది. ఈసారి కొత్తగా నిర్మల్, మంచిర్యాల, సిద్దిపేటలలో స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 15 వేల మంది మూల్యాంకనంలో పాల్గొంటున్నారు.
ఇప్పటినుంచి నెలలోగా ఫలితాలు విడుదల చేస్తామని బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ప్రశ్నపత్రాల్లో చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని.. వచ్చే ఏడాది తప్పులు జరగకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు.