దేశంలో ఇప్పుడు నడిపించిన మేరకే మోటారు బీమా పాలసీ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఏడాదిలో ఎన్ని కిలోమీటర్లు నడుపుతామని వాహనదారుడు అంచనా వేసుకుంటారో ఆ మేరకే బీమా చేసుకోవచ్చు. 'పే-యాజ్-యూ-డ్రైవ్"గా చెబుతున్న ఈ ఇన్సూరెన్స్‌పై కంపెనీలు ప్రచారం ప్రారంభించాయి. ఎప్పుడూ రోడ్లపై తిరిగే డ్రైవర్లు కాకుండా.... మిగిలిన వారు వాహన బీమా ఖర్చును తగ్గించుకోవడానికి మంచి అవకాశంగా చెబుతున్నాయి. ఎడెల్ వైజ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో వాహన యజమానులు బీమాను ఉపయోగించే ఆధారంగా ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఫ్లోటర్ పాలసీ కావడంతో ఒకే పాలసీ కింద పలు వాహనాలకు కూడా కవరేజి పొందవచ్చు. వాహనాన్ని ఉపయోగించిన మేరకే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ స్వీచ్ ఆన్ చేసి ఉన్నప్పుడు మాత్రమే ప్రమాద డ్యామేజ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఐతే అగ్నిప్రమాదం, చోరీకి సంబంధించిన ఘటనలకు కవరేజీ ఏడాదిపాటు వర్తిస్తుంది.
కిలోమీటర్లు డ్రైవ్ చేస్తారనే అంచనా
ఐఆర్డీఏఐ శాండ్ బాక్స్ ప్రాజెక్ట్ కింద భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ పే-యాజ్-యూ-డ్రైవ్ ఇన్సూరెన్స్‌ను అందిస్తోంది. ఇందులో థర్డ్ పార్టీ ప్రీమియాన్ని ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం నిర్ణయిస్తారు. ఓడీని మాత్రం కారు ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేస్తారనే అంచనా ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ పరిమితి మధ్యలో అధిక శ్లాబ్‌తోపాటు సాధారణ బీమాకు మారే అవకాశం ఉంటుంది. పరిమితిదాటితే... థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే వర్తించగా... క్లెయిమ్ సమయంలో ఓన్ డ్యామేజ్‌కు మాత్రం కవరేజీ లభించదు.