తెలంగాణ

telangana

ETV Bharat / state

పదో తరగతి పరీక్షల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ

పదో తరగతి పరీక్షల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈనెల 7 తర్వాత పరీక్షలు నిర్వహించాలని గతంలో ఉన్నత న్యాయస్థానం సూచించింది. మరోసారి ఈనెల 3న పరిస్థితిని సమీక్షించి.. తుది నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే పరీక్షల నిర్వహణకు ముందుకు వెళ్లవద్దని గత నెల 19న హైకోర్టు స్పష్టం చేసింది.

high court latest news
high court latest news

By

Published : Jun 4, 2020, 5:30 AM IST

పదో తరగతి పరీక్షల నిర్వహణపై నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరోసారి విచారణ చేపట్టనున్నారు. హైకోర్టు సూచనల మేరకు ఈనెల 8 నుంచి జులై 5 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యా శాఖ సిద్ధమైంది. ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉండేలా ఎస్ఎస్​సీ బోర్డు షెడ్యూలును కూడా ప్రకటించింది.

కొన్ని ముఖ్యమైన పరీక్ష కేంద్రాల్లో ట్రయల్ కూడా నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలు, ఐసీఎంఆర్, ఎయిమ్స్, ఇతర వైద్యారోగ్య శాఖల మార్గదర్శకాలు, సూచనలు కచ్చితంగా పాటించి.. పరీక్షలు పూర్తిచేస్తామని హైకోర్టును కోరాలని పాఠశాల విద్యా శాఖ సిద్ధమైంది. ఇటీవల కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. హైకోర్టు నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details