తెలంగాణ

telangana

ETV Bharat / state

'వినూత్న బోధన దేశ స్థితి గతుల్ని మార్చేస్తుంది'

తరగతి గదిలో పాఠాలు సులభంగా అర్థమయ్యేలా ఉపాధ్యాయులు  వినూత్న బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దడం అభినందనీయం అన్నారు  పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం. ఇలాంటి ఉపాధ్యయులను సన్మానించడం హర్షనీయమన్నారు.

విద్యార్థులను బాల్యం నుంచే తమకు ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించాలి : చింతకింది మల్లేశం

By

Published : Sep 15, 2019, 12:07 AM IST

ఉపాధ్యయులు తరగతి గదిలోని విద్యా విధానం ద్వారా దేశ భవిష్యత్తునే మార్చగలరని పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం అన్నారు. ఓయు దూర విద్యా కేంద్రంలో టీచర్స్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో టీచర్స్ అవార్డ్స్ 2019 కార్యక్రమాన్ని నిర్వహించారు. టీచర్స్ సంస్థ వివిధ జిల్లాల్లోని నిపుణులు, విద్యార్థులు, వినూత్న బోధకులను గుర్తించి సత్కరించడం హర్షణీయమన్నారు.
దేశంలోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను బాల్యం నుంచే తమకు మక్కువ ఉన్న విభాగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు చింతకింది మల్లేశం. విద్యార్థుల మేధాశక్తికి అనుగుణంగా విద్య అందిస్తే ఫలితం తప్పక ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నంగా ఉత్తమ బోధన అందించిన 16 మంది ఉపాధ్యాయులకు మల్లేశం చేతుల మీదుగా జ్ఞాపికలు అందించి సన్మానించారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు హాజరయ్యారు.

విద్యార్థులను బాల్యం నుంచే తమకు ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించాలి : చింతకింది మల్లేశం
ఇవీ చూడండి : ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలి: తమిళిసై

ABOUT THE AUTHOR

...view details