పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా సంక్షోభం దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. లాక్‌డౌన్ తర్వాత పారిశ్రామిక కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాలన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. కరోనా సంక్షోభం క్రమంగా తొలగిపోతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. అనేక దేశాలు తమ పెట్టుబడులను కొత్త ప్రాంతాలకు తరలించే యత్నాల్లో ఉన్నాయని మంత్రి అన్నారు. ఆయా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ టీ వర్క్స్ పనులు జరుగుతున్న కొన్ని నమూనాల రూపకల్పనలను పరిశీలించారు. ఇటీవల తయారు చేసిన వెంటిలేటర్ విధాన పని తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు.
లాక్‌డౌన్ తర్వాత పరిశ్రమలు యథావిధిగా నడవాలి: కేటీఆర్ - MINISTER KTR
18:56 April 30
లాక్‌డౌన్ తర్వాత పరిశ్రమలు యథావిధిగా నడవాలి: కేటీఆర్
భౌతిక దూరం కొనసాగాలి...
భవిష్యత్తులో పరిశ్రమల్లోని పని స్థితిగతులు మారతాయని ఆశా భావం వ్యక్తం చేశారు. భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో కొన్ని మార్పులు చేసుకుని పనిచేయాల్సి ఉంటుందన్నారు. సిబ్బందికి మరింత నమ్మకం కలిగించేలా పరిశ్రమలు వివిధ చర్యలు తీసుకోవాలన్నారు. విదేశీ సంస్థల పెట్టుబడులను అందుకునేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుత సంక్షోభం వల్ల ఆయా రంగాల్లోని పరిస్థితులను అధ్యయనం చేయాలని మంత్రి వివరించారు.