హైదరాబాద్‌లోని ప్రసిద్ధి చెందిన ఇందిరాపార్కులో నరికివేసిన గంధం చెట్లు మాయం కావడంపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్కులో దాదాపుగా 130 చెట్లను జీహెచ్‌ఎంసీ అధికారులు పెంచుతున్నారు. మూడు రోజుల క్రితం 12 గంధం చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా తరలించారు.
ఇందిరాపార్కులో గంధం చెట్లు మాయంపై పోలీసులకు ఫిర్యాదు - హైదరాబాద్ తాజా వార్తలు
హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో గంధం చెట్లు మాయమవుతున్నాయి. కొందరు వ్యక్తులు రాత్రివేళల్లో అక్రమంగా చొరబడి నరికివేసిన చెట్లను తరలించారు. ఈ విషయంపై గాంధీనగర్ పోలీసులకు ఇందిరాపార్కు అధికారులు ఫిర్యాదు చేశారు.
ఇందిరాపార్కులో గంధం చెట్లు మాయంపై పోలీసులకు ఫిర్యాదు
పార్కు అధికారులు దశలవారీగా చెట్లను నరికివేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రి సమయంలో చెట్లను తరలించినట్లు తెలుస్తోంది. దీంతో గాంధీనగర్ పోలీసులకు పార్కు అధికారులు ఫిర్యాదు చేశారు.