దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి(ఏబీ)తో నడుస్తున్న జాతీయ వ్యవసాయ సంస్థలపై కేంద్రం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మొత్తం 11 సంస్థలపై రతన్ పి.వటల్ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. వీటిలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ’(మేనేజ్), జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ(ఎన్‌ఐపీహెచ్‌ఎం)లు ఉన్నాయి. వీటికి పూర్తిస్థాయి స్వతంత్ర ప్రతిపత్తి హోదాను తొలగించి ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’(ఐసీఏఆర్)పరిధిలోకి తేవాలని కేంద్ర వ్యవసాయశాఖ సూచించింది. ఈ రెండింటితో పాటు చౌదరి చరణ్‌సింగ్ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సంస్థను కూడా ఇలాగే మండలి కిందకు తేవాలని కోరింది. మొత్తం 11లో ఈ మూడు సంస్థలకు మాత్రమే స్వతంత్ర ప్రతిపత్తిని తొలగించాలని సిఫార్సు చేయడం గమనార్హం.
- మరో 3 సంస్థలు.. చిన్న రైతుల వ్యవసాయ కన్సార్షియం(సీఫాక్), జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ), జాతీయ సహకార శిక్షణ మండలికి కేంద్ర బడ్జెట్ నుంచి నిధుల కేటాయింపు నిలిపివేయాలి.
- కేంద్ర ఉద్యాన సంస్థను, జాతీయ కొబ్బరి అభివృద్ధి మండలిని జాతీయ ఉద్యాన మండలి పరిధిలోకి తేవాలి.
- మొత్తం 11 జాతీయ వ్యవసాయ సంస్థల్లో రెండింటిని యధావిధిగా కొనసాగించాలి. మరో అయిదింటిని 2 సంస్థలుగా మార్చేయాలి. మిగిలిన 4 సంస్థలకూ కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తగ్గించాలని కేంద్ర వ్యయ మంత్రిత్వశాఖ ప్రభుత్వానికి సూచించింది.
కమిటీ వద్దన్నా...