శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి 1, 60, 137 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా ఉంది. అలాగే గరిష్ఠ నీటినిల్వ 215.807 టీఎంసీలుకాగా... ప్రస్తుత నీటినిల్వ 204.7889 టీఎంసీలుగా నమోదైంది.
Srisailam Reservoir: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం.. శ్రీశైలానికి వరద
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. లక్షా 60 వేల 137 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది.
జలాశయంలో పెరిగిన వరద
శ్రీశైలం జలాశయం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ... 59,632 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
ఇదీ చూడండి:మత్తులో చిన్నారులను చిదిమేస్తున్న ఉన్మాదులు.. తెలంగాణలో పెరుగుతున్న పోక్సో కేసులు