తెలంగాణ

telangana

ETV Bharat / state

మినీ పురపోరులో స్టార్‌ క్యాంపెయినర్ల సంఖ్య పెంపు

మినీ పురపోరులో స్టార్‌ క్యాంపెయినర్ల సంఖ్య పెంపుపై ఎస్​ఈసీ సానుకూలంగా స్పందించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరఫున 15 మందికి, గుర్తింపు పొందని వాటిలో ఐదుగురికి అవకాశం కల్పించింది.

increase-the-number-of-star-campaigners-in-the-municipal-corporation
మినీ పురపోరులో స్టార్‌ క్యాంపెయినర్ల సంఖ్య పెంపు

By

Published : Apr 19, 2021, 2:22 PM IST

మినీ పురపోరులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరపున స్టార్ కాంపెయినర్ల సంఖ్య పెరిగింది. సాధారణంగా స్థానికసంస్థల ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీల తరపున 10 మందికి, గుర్తింపు పొందకుండా నమోదైన పార్టీల తరపున ఐదు మంది స్టార్ క్యాంపెయినర్లుగా అవకాశం ఇస్తుంటారు. ఈ సంఖ్యను పెంచాలని కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి.

వాటినిపై సానుకూలంగా స్పందించిన ఎస్ఈసీ... మినీ పురపోరులో... గుర్తింపు పొందిన పార్టీల తరపున 15 మంది, గుర్తింపు పొందని పార్టీల తరపున ఐదుగురు స్టార్ క్యాంపెయినర్లకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఐదు రోజుల్లోగా పురపాలకశాఖ సంచాలకులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

ABOUT THE AUTHOR

...view details