తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్సిటీల నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు - Tspsc updates

వ్యవసాయ, పశుసంవర్ధక విశ్వవిద్యాలయాల్లో 127 సీనియర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులకు మార్చి 31న పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్​లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కానున్నాయి.

EWS reservations
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు

By

Published : Apr 9, 2021, 8:27 PM IST

వ్యవసాయ, పశుసంవర్ధక విశ్వవిద్యాలయాల్లో నియామకాల కోసం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్​లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రెండు విశ్వవిద్యాలయాల్లో 127 సీనియర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులకు మార్చి 31న పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.

కేంద్ర చట్టం ప్రకారం రాష్ట్రంలోనూ ఆర్థికంగా వెనకబడిన వారికి పదిశాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. టీఎస్​పీఎస్​సీ ఇచ్చిన తాజా నోటిఫికేషన్​లోని పోస్టులకు పదిశాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింపజేస్తూ రోస్టర్ పాయింట్లు ఖరారు చేశారు.

అందుకు అనుగుణంగా మార్చి 31న జారీ చేసిన నోటిఫికేషన్​కు అనుబంధాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ ఇచ్చింది. ఈ పోస్టులకు ఈనెల 19 నుంచి మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్​పీఎస్​సీ తెలిపింది.

ఇదీ చదవండి:రైళ్లలో రద్దీ సాధారణంగానే ఉంది: ద.మ. రైల్వే జీఎం

ABOUT THE AUTHOR

...view details