తెలంగాణ

telangana

ETV Bharat / state

'తక్షణమే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలి'

ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ తీరును సీపీఐ ఖండించింది. వారిని చర్చలకు పిలవాల్సింది పోయి.. వారిపై దాడులు చేయడం, వేధించడం సరికాదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు.

ప్రభుత్వ తీరు కార్మికులను రెచ్చగొట్టేలా ఉంది : నారాయణ

By

Published : Nov 16, 2019, 10:40 AM IST

Updated : Nov 16, 2019, 11:13 AM IST

ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం తమ తీరు మార్చుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. ప్రశాంతంగా నిరవధిక దీక్ష చేస్తామని ప్రకటిస్తే జేఏసీ నాయకులను గృహానిర్భందించం, వారి ఇళ్లపై దాడులను ఆయన ఖండించారు. ప్రభుత్వ తీరు కార్మికులను రెచ్చగొట్టే పద్ధతుల్లో ఉందని దుయ్యబట్టారు.

కార్మిక సంఘాలు బాధ్యతాయుతంగా చర్చించి విలీనాన్ని వాయిదా వేసుకుంటున్నామని ప్రకటించినప్పటికీ ప్రభుత్వం ఆహ్వానించి చర్చలకు పిలవాల్సిందిపోయి రెచ్చగొట్టే పద్ధతిని అవలంభిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో తక్షణమే ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ తీరు కార్మికులను రెచ్చగొట్టేలా ఉంది : నారాయణ

ఇవీ చూడండి : ఉద్యోగం రాదని ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్​ ఆత్మహత్యాయత్నం

Last Updated : Nov 16, 2019, 11:13 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details