జగిత్యాలలో ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. మహాలక్ష్మీనగర్లో నివసించే అద్దెబస్సు డ్రైవర్ కొక్కిస రాజన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బాధితున్ని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, తాజా పరిణామాలు తనను కలిసి వేశాయని రాజన్న తెలిపారు. ఏడేళ్లుగా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్గా పని చేస్తున్నానని.. నెలకు రూ.11 వేలు వచ్చే వేతనం సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తుందని ఇన్నాళ్లూ చూసానన్నాడు. కార్మికుల సమస్యలు కొలిక్కి రాకపోవటం వల్ల... తన సమస్య కూడా పరిష్కారం కాదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు డ్రైవర్ రాజన్న తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి: బొమ్మ గీయాలంటే.. కుంచె అవసరం లేదు..!