రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ, వీవోఏ ఉద్యోగుల విషయంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వీడాలని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఛలో హైదరాబాద్ పేరుతో ఆందోళన చేయనున్నట్లు ఐకేపీ, వీవోఏ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు వెంకటేష్ తెలిపారు.
17న ఐకేపీ, వీవోఏ ఉద్యోగుల ఛలో హైదరాబాద్ - హైదరాబాద్ నేటి వార్తలు
ఐకేపీ, వీవోఏ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆ అంశంపై ఈనెల 17న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఐకేపీ, వీవోఏ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు వెంకటేష్ తెలిపారు.
సమస్యలపై ఐకేపీ, వీవోఏ ఉద్యోగుల ఛలో హైదరాబాద్
ఐకేపీ, వీవోఏ ఉద్యోగులకు ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలన్నారు. గౌరవ వేతనం పేరుతో దోపిడీకి గురి చేయడం సరికాదన్నారు. ఉద్యోగులకు కనీస వేతనం నిర్ణయించి, ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలని కోరారు. ఈ విషయంపై ఈనెల 17న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. మార్చి 11 నుంచి 16 వరకు అన్ని జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి :కేటీఆర్ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం