తెలంగాణ

telangana

ETV Bharat / state

అందుబాటులోకి ఐ హెల్త్​ యాప్​ - jayash ranjan

ఇండస్ట్రియల్​ హెల్త్​ క్లినిక్​ లిమిటెడ్​ సరికొత్త అప్లికేషన్​ను​ అందుబాటులోకి తెచ్చింది. ఐ హెల్త్​ అనే యాప్​ను ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు.

ఐ హెల్త్​

By

Published : May 25, 2019, 6:21 AM IST

ఖాయిలా పడేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలకు ఊతం ఇచ్చి.... తిరిగి లాభాల బాట పట్టించే లక్ష్యంతో సర్కారు ప్రారంభించిన ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ సరికొత్త " ఐ హెల్త్​ "అనే యాప్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ ఈ అప్లికేషన్​ని ప్రారంభించారు. లాభాలు లేకుండా, మార్కెట్​లోకి చొచ్చుకుపోలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంస్థలు తమ వివరాలను ఈ యాప్​లో పొందుపరచాల్సి ఉంటుంది. వివరాల ఆధారంగా వారికి ఎలాంటి సహకారం అవసరమో గుర్తిస్తారని జయేష్ రంజన్ తెలిపారు. తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ ఆ సంస్థలకు బ్యాంకు రుణాలు, మార్కెటింగ్​కి సంబంధించిన శిక్షణ వంటి సహకారాన్ని అందిస్తాయన్నారు.

అందుబాటులోకి ఐ హెల్త్​ యాప్​
ఇవీ చూడండి: కేసీఆర్​ను కలిసిన తెరాస కొత్త ఎంపీలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details