తెలంగాణ

telangana

ETV Bharat / state

కాపాడకుండా వీడియోలు తీస్తే ఎలా? - PREMA HATHYALU

ఈ నెల 7న హైదరాబాద్​ నడిబోడ్డున ప్రేమజంటపై జరిగిన హత్య కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్​ చేశారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు కాపాడాల్సిన ప్రజలే వీడియోలు తీయడంపై అసహనం వ్యక్తం చేశారు పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్​.

కాపాడకుండా వీడియోలు తీస్తే ఎలా?

By

Published : Jun 9, 2019, 1:39 PM IST

హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లో ప్రేమజంటపై హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్​ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిందితుల వద్ద నుంచి రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు కాపాడాల్సిన ప్రజలే వీడియోలు తీయడం దారుణమన్నారు డీసీపీ. ఆ సమయంలోనే ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిర్వర్తించాలన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడతామన్నారు.

కాపాడకుండా వీడియోలు తీస్తే ఎలా?

ABOUT THE AUTHOR

...view details