మహా నగరంలో పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేలా ఆకాశమార్గాల(స్కైవేస్)ను హెచ్‌ఎండీఏ అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఉప్పల్‌లో రూ.25 కోట్లతో నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. 9 నెలల్లో దీనిని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇప్పుడు మెహిదీపట్నం స్టీల్ స్కైవే డిజైన్‌కు మంత్రి కేటీఆర్ ఆమోదముద్ర వేయడంతో తాజాగా రూ.34 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహ్వానించారు.
- ఉప్పల్‌లో రామంతాపూర్, బోడుప్పల్, హబ్సిగూడ, ఎల్బీనగర్ వైపు వెళ్లే మార్గాలను అనుసంధానం చేస్తూ సర్కిల్ తరహాలో 660 శ్రీ 4 మీటర్ల పొడవువెడల్పు, 6 మీటర్ల ఎత్తులో స్కైవాక్‌ను అందుబాటులోకి తీసుకువస్తారు. తద్వారా నేరుగా ఉప్పల్ మెట్రో స్టేషన్‌లోకి వెళ్లొచ్చు.
- మెహిదీపట్నం కూడలిలో ఇరువైపులా ఉన్న బస్టాండ్లను అనుసంధానిస్తూ మధ్యలో ఉన్న పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే కింది నుంచి స్టీల్ స్కైవే(పొడవు సుమారు 380 మీటరు,్ల వెడల్పు 3.6 మీటర్లు, ఎత్తు 6.15 మీటర్లు) నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాణిజ్య సముదాయాన్నీ నిర్మిస్తారు. దీని కింద అయిదారు బస్సులు నిలిపేలా బస్‌బే ఉంటుంది. పైన దుకాణాలకు అద్దెకిస్తారు. 16 లిఫ్ట్‌లూ ఉంటాయి