తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad SI Rajendra Drugs Case Update : డ్రగ్స్ కేసు అప్డేట్.. SI రాజేంద్ర కాల్​డేటాలో అసలుగుట్టు

Hyderabad SI Rajendra Drugs Case Update : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఎస్సై రాజేంద్ర కేసు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పలుమార్లు ఉన్నతాధికారులు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకుండా అవినీతి, అక్రమాలకు చిరునామాగా మారాడు. మత్తుపదార్థాలను కట్టడి చేయాల్సిన పోలీసు.. తప్పటడుగు వేయడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇటీవల డ్రగ్స్‌ విక్రయించేందుకు ప్రయత్నిస్తూ అరెస్టయిన ఎస్సై రాజేంద్ర కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Hyderabad SI Drugs Case
Hyderabad SI Drugs Case Update

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 8:58 AM IST

Hyderabad SI Drugs Case Update ఎస్సై కేసు దర్యాప్తులో కొత్తకోణాలు గతంలోనూ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రాజేంద్ర

Hyderabad SI Rajendra Drugs Case Update :హైదరాబాద్‌ శివారు ప్రాంతానికి చెందిన ఓ వైద్యుడికి మందులు విక్రయిస్తామంటూ మాయగాళ్లు ఆన్‌లైన్‌ ద్వారా 26 లక్షలు టోకరా వేశారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు మొదలుపెట్టిన సైబర్‌ క్రైమ్ పోలీసులు(Cyber Crime Police) ముంబయిలో ఉంటున్న నైజీరియన్‌ ఒకెరొకో ఇకేబీ ప్రధాన నిందితుడిగా నిర్ధారించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇకేబీని పట్టుకునేందుకు ఎస్సై రాజేంద్ర మరో ముగ్గురు కానిస్టేబుళ్లు ముంబయికి వెళ్లారు.

Hyderabad SI Rajendra Call Data :అప్పటికే నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్‌ కేసులో ఇతడి కోసం ముంబయి పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్‌ పోలీసులు అక్కడి న్యాయస్థానంలో హాజరుపరచి పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకొచ్చారు. సైబర్‌ నేరం కేసులో కూకట్‌పల్లి కోర్టులో నిందితుడికి బెయిల్‌ దొరికిన వెంటనే డ్రగ్స్‌ కేసులో ముంబయి పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించగా ఇకేబీ హల్‌చల్‌ చేశాడు. తనను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ వాగ్వాదానికి దిగటంతో స్వయంగా న్యాయమూర్తి వచ్చి నిందితుడికి అనుకూలంగా వ్యవహరించారు. ఈ ఘటనపై సైబరాబాద్‌ సీపీ హైకోర్టుకు ఫిర్యాదు చేయటంతో సదరు న్యాయమూర్తిని సస్పెండ్ చేశారు.

Telangana SI Arrested for Selling Drugs : కటకటాల్లోకి ఖాకీ అధికారి.. డ్రగ్స్ విక్రయిస్తూ ఎస్సై అరెస్ట్

Hyderabad Sub Inspector Arrested for Drugs Supply :నైజీరియాకు చెందిన ఒకెరొకో ఇకేబీ వ్యాపార వీసాతో భారత్‌ చేరాడు. ముంబయిలో ఉంటూ మాదకద్రవ్యాల విక్రయాలు(Drug Sales), సైబర్‌ నేరాలకు పాల్పడ్డాడు. నైజీరియా నుంచి మేకె బెంజైన్‌ పేరుతో మరో నకిలీ వీసా తీసుకోన్నాడు. ముంబయి అడ్డాగా మార్చుకొని కోట్లల్లో సింథటిక్‌ డ్రగ్స్‌ దందా మొదలు పెట్టాడు. ఇకేబీని అరెస్టు చేసేందుకు ముంబయి, సైబరాబాద్‌ పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులు పారిపోగా ఇకేబీని అదుపులోకి తీసుకున్నారు. అతడి నివాసంలో 5 కిలోల మెథకొలిన్‌లో 3 కిలోలు ముంబయి పోలీసులు స్వాధీనం చేసుకోగా.. మిగిలిన 2 కిలోల సంచి ఎస్సై రాజేంద్ర తీసుకున్నాడు. రిమాండ్‌ రిపోర్టులో మాత్రం 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే సదరు ఎస్సై అరెస్టయినప్పుడు 1,750 గ్రాముల డ్రగ్స్ రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 250 గ్రాముల గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం.

Telangana Sub Inspector Arrested for Selling Drugs : :ఈ కేసులో ఎస్సైతో పాటు వెళ్లిన ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రస్తుతం మరోకేసు దర్యాప్తులో వేరే రాష్ట్రంలో ఉన్నట్లు సమాచారం. వారు తిరిగివచ్చాక పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 2013లో లంచం తీసుకుంటూ రాజేంద్రఏసీబీ(SI Rajendra)కి చిక్కాడు. రెండేళ్ల జైలు శిక్ష, 5 వేల జరిమానా విధిస్తూ 2022 సెప్టెంబరులో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు కాలయాపన చేయటంతో శిక్ష ఖరారైన తర్వాత సైతం కొద్ది రోజులు సదరు ఎస్సై విధులు నిర్వర్తించారు. మరోవైపు అవినీతి కేసులో అరెస్టయిన పోలీసు శాఖలో కొనసాగాలని ధృవీకరిస్తూ ఇద్దరు పోలీసు అధికారులు సిఫారసు చేయటం విశేషం. డ్రగ్స్‌ కేసులో ఎస్సై వెనుక ఉన్న అజ్ఞాత శక్తి ఎవరనే దానిపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తన్నట్లు సమాచారం.

Hyderabad Sub Inspector Drugs Case Update : ఖాకీ వనంలో డ్రగ్స్.. ఆ ముగ్గురిపై కూడా పోలీసుల ఫోకస్​

Cyber Crime SI Arrested in Drugs Case : డ్రగ్స్ పట్టివేతలో చేతివాటం.. సైబర్‌ క్రైమ్ ఎస్సై అరెస్ట్.. రిమాండ్​కు తరలింపు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details