సికింద్రాబాద్లోని తుకారాం గేట్ పోలీసులు ఓ యువకుడిని చితకబాదారు. బయట ఏదో చిన్న గొడవ జరిగితే... తానేం తప్పు చేయకున్న ఇష్టమొచ్చినట్లుగా పోలీసులు కొట్టారని బాధితుడు సాయితేజ వాపోయాడు. తమ కొడుకును ఎందుకు కొట్టారని తల్లిదండ్రులు పోలీసులను ప్రశ్నిస్తే... పొంతన లేని సమాధానాలు చెప్తూ తమ ముందే దాడికి దిగారని వెల్లడించారు. ఎస్ఐ రాంలాల్, కానిస్టేబుళ్ల వల్ల తనకు ప్రాణహాని ఉందని సాయితేజ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిన్న అర్ధరాత్రి పీఎస్ ముందు గొడవ జరగగా... బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
యువకుడిని చితకబాదిన హైదరాబాద్ పోలీసులు - యువకుడిని చితకబాదిన హైదరాబాద్ పోలీసులు
తాను ఏ తప్పు చేయకపోయినా పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొట్టారంటూ ఓ యువకుడు ఆరోపిస్తున్నాడు. నిన్న రాత్రి ఎస్ఐ, కానిస్టేబుళ్లు తనని చంపాలని చూశారని చెప్పాడు.
యువకుడిని చితకబాదిన హైదరాబాద్ పోలీసులు