Hyderabad Metro charges hike : మెట్రో ఛార్జీలపై ‘ఫేర్ ఫిక్సేషన్ కమిటీ’ అధ్యయనం చేస్తోంది. ఆ నివేదిక ఆధారంగా త్వరలో ఛార్జీల పెంపు ఉండనుందని తెలుస్తోంది. మరోవైపు ఆర్థికంగా ప్రాజెక్ట్ పునర్నిర్మాణామంపై ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో సంస్థ దృష్టి పెట్టింది. ఆదాయం పెంచుకోవడంతోపాటు ప్రాజెక్ట్‌ను లాభదాయకంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.
వడ్డీ భారం తగ్గిందిలా..మెట్రో నిర్మాణ ఖర్చు మొత్తం రూ.13 వేల కోట్లు ఎల్ అండ్ టీ సంస్థనే భరించింది. బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణం తీసుకుంది. లాక్‌డౌన్‌తో నష్టాల్లోకి కూరుకుపోయింది. రుణాలకు వడ్డీ చెల్లించలేని పరిస్థితి ఏర్పడటంతో కమర్షియల్ లోన్లను ఎల్ అండ్ టీ గ్యారంటీ బాండ్లుగా మార్చి వడ్డీని 9 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించుకుంది. మరోవైపు రూ.3 వేల కోట్ల సాఫ్ట్ లోన్ ఇచ్చి ఆదుకోవాలని ఆ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై సర్కారు సానుకూల స్పందించిందని మెట్రో వర్గాలు తెలిపాయి.