తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబా​ద్​ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య - suicide

సంగారెడ్డి సమీపంలోని ఐఐటీ హైదరాబాద్​లో ఎం డిజైన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్​నోట్​ రాసి తన గదిలోని ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబా​ద్​ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

By

Published : Jul 2, 2019, 5:17 PM IST

Updated : Jul 2, 2019, 8:12 PM IST

ఐఐటీ హైదరాబాద్​లో ఎం డిజైన్​ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి బలన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఉత్తర్​ ప్రదేశ్​లోని వారణాసికి చెందిన మార్క్ అండ్రూ చార్లెస్​గా గుర్తించారు. సోమవారం రాత్రి 11గంటల సమయంలో తన గదికి వెళ్లిన మార్క్ ఈరోజు మధ్యాహ్నం వరకు బయటకు రాలేదు. అనుమానమొచ్చిన స్నేహితులు తలుపులు పగలగొట్టారు. విద్యార్థి అప్పటికే ఉరివేసుకుని విగతజీవిగా ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు.

మనస్తాపంతోనే..

జీవితం మీద విరక్తితో తనువు చాలిస్తున్నట్లు ఎనిమిది పేజీల సూసైడ్​ నోట్​రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బీఎఫ్ఎ డిగ్రీ చదివాడు. జీవితంలో అన్నీ కోల్పోయానని, ఈ లోకం తనని తిరస్కరించిందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. మృతదేహాన్ని ఖననం చేయకుండా ఏదైనా వైద్య ప్రయోగశాలకు అప్పగించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

హైదరాబా​ద్​ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

ఇదీ చూడండి: దైవదర్శనాని వెళ్తుంటే... కారు బోల్తా

Last Updated : Jul 2, 2019, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details