హైదరాబాద్‌లో వర్షాలు తగ్గినా వరద కష్టాలు మాత్రం తీరడం లేదు. చెరువులు పొంగి కాలనీల్లోకి చేరిన నీరు బయటికి వెళ్లే మార్గం లేకపోవటంతో లోతట్టు ప్రాంతాలు జలమయంలోనే ఉన్నాయి. ఎల్బీనగర్ పరిధిలోని హరిహరపురంకాలనీ వాసులు ఇంకా వరద నీటిలోనే మగ్గుతున్నారు. నీళ్లు తోడేసి... పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.
వర్షాలు తగ్గినా.. కష్టాలు తీరడం లేదు...
హైదరాబాద్‌లో వర్షాలు తగ్గినా పలు కాలనీలు జలమయంలోనే ఉన్నాయి. చెరువులు పొంగి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరుతోంది. నీళ్లు తోడేసి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వర్షాలు తగ్గినా.. కష్టాలు తీరడం లేదు...