ఈ నెల 11న జరగే సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ నగర పౌరులు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్ కోరారు. పోలింగ్ శాతం పెంపునకు ఓటర్లకు విస్తృత అవగాహన కల్పించామన్నారు. రానున్న రెండు రోజుల పాటు నగదు, మద్యం పంపిణీపై నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేశామని వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల క్రతువు ముగిసేలా చర్యలు తీసుకున్నామన్న దానకిశోర్తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'ప్రశాంత వాతావరణంలో ఓటేసేలా చర్యలు తీసుకున్నాం' - హైదరాబాద్ ఎన్నికల అధికారి
రాజకీయ పార్టీల ప్రచారం పర్వం ముగిసింది. ఇక పోలింగ్ సమరానికి తెర లేవనుంది. హైదరాబాద్లో ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిశోర్ తెలిపారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
దాన కిషోర్