ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు... హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులలో పారిశుద్ధ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగానే కింగ్ కోఠి ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. డిప్యూటీ మేయర్‌తో పాటు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి, గన్‌ఫౌండ్రి కార్పొరేటర్ సురేఖలు ఉన్నారు. కరోనా రోగులతో మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
కింగ్ కోఠి ఆస్పత్రిని సందర్శించిన డిప్యూటీ మేయర్ - king koti hospital latest news
హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కింగ్ కోఠి ఆసుపత్రిని సందర్శించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు.
కింగ్ కోఠి ఆస్పత్రిని సందర్శించిన డిప్యూటీ మేయర్
అనంతరం ఆసుపత్రి అధికారులతో, వైద్యులతో చర్చించారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికి తెరాస ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి :'గాంధీలో మృత్యుంజయులు 44,335 మంది'