కరోనా బారినపడి కోలుకున్న 31 మంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని... హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్‌తో కలిసి సీపీ అంజనీ కుమార్... నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో సన్మానించారు. మహమ్మారిని జయించడం సంతోషకరమని సీపీ అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీస్ శాఖ పాత్ర చిరస్మరణీయమని... లాక్ డౌన్, కంటైన్‌మెంట్ జోన్లు, వలస కూలీల తరలింపులో ఎంతో కీలక పాత్ర పోషించామని పేర్కొన్నారు. కరోనా నుంచి తొందరగా కోలుకుని తిరిగి విధుల్లో చేరడం సమజానికే ఆదర్శమన్నారు.
'కరోనాను జయించి విధుల్లో చేరడం సమాజానికే ఆదర్శం' - ట్రాఫిక్ అధికారులకు సీపీ అంజనీకుమార్ సన్మానం
కరోనా విపత్కర పరిస్థితుల్లో పోలీసుల పాత్ర చిరస్మరణీయమని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. కరోనా బారినపడి కోలుకుని తిరిగి విధుల్లో చేరిన 31 మంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని ట్రాఫిక్ అదనపు సీపీతో కలిసి సన్మానించారు. తొందరగా కోలుకుని తిరిగి విధుల్లో చేరడం సమాజానికే ఆదర్శమన్నారు.
hyderabad cp
ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పోలీస్ మంచి పేరు సంపాదించిందని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని విధులు నిర్వర్తించాలని సూచించారు. కరోనా బారిన పడి 31 మంది ట్రాఫిక్ పోలీసులు కోలుకొని విధుల్లో చేరడం సంతోషకరమని ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ అన్నారు. కరోనా విజృంభిస్తోన్న ఎంతో ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు.
చదవండి :కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ