హైదరాబాద్‌లో జాంబాగ్, ఎంజే మార్కెట్లో వ్యాపారులు భౌతిక దూరం పాటించడంలేదన్న ఫిర్యాదుతో సీపీ అంజనీ కుమార్ ఆ ప్రాంతంలో పర్యటించారు. కరోనా నివారించాలంటే తప్పనిసరిగా వ్యాపారులు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు.
'భౌతిక దూరం పాటిస్తూ.. వ్యాపారం చేసుకోవాలి'
హైదరాబాద్‌లో వ్యాపారులు భౌతిక దూరం పాటిస్తూ తమ వ్యాపారం చేసుకోవాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు. ఎంజే మార్కెట్ పరిధిలో పర్యటించారు.
జాంబాగ్‌లో సీపీ అంజనీ కుమార్ పర్యటన
లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా ఎవరైనా వ్యాపారం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.