కరోనాను కట్టడి చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేస్తోందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. ప్రతీ ఒక్కరూ సర్కారు విధించిన ఆంక్షలను కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు. నగరంలోని దిల్సుఖ్ నగర్లో నిర్వహిస్తోన్న తనిఖీ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ ఎల్బీనగర్ వైపు నుంచి వచ్చే వాహనదారును ప్రశ్నించారు. అనుమతి లేకుండా బయటికి వచ్చే వారి వాహనాలు సీజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలి: సీపీ అంజనీ కుమార్ - cp anjani kumar latest news
దేశంలోనే హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఉందని సీపీ అంజనీ కుమార్ అన్నారు. దిల్సుఖ్ నగర్లో నిర్వహిస్తోన్న తనిఖీ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన పలు వాహనదదారులను ఆపి ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరూ సర్కారు విధించిన ఆంక్షలను కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు.
ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరించాలని సీపీ అంజనీ కుమార్ అన్నారు. దేశంలోనే హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఏయిర్ అంబులెన్సుల ద్వారా రాష్ట్రానికి చేరుకుని ఇక్కడి ఆసుత్రుల్లో చేరుతున్నారని పేర్కొన్నారు. కొంతమంది వాహనదారులు పోలీసులు ఇచ్చిన ఈ-పాసులను, గుర్తింపు కార్డులను దుర్వినియోగం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని... అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతల సేవా కార్యక్రమాలు