కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ నిమజ్జనం చేసుకుంటున్నందుకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక క్రేన్లు ఏర్పాటు చేస్తున్నాం: సీపీ అంజనీకుమార్ - సీపీ అంజనీ కుమార్ వార్తలు
ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పరిశీలించారు. గణేశ్ నిమజ్జనానికి ప్రజలు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక క్రేన్లు ఏర్పాటు చేస్తున్నామని సీపీ వివరించారు. వీలైనంత తక్కువమంది నిమజ్జనానికి రావాలని విజ్ఞప్తి చేశారు.
cp anjani kumar
నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. క్రేన్లు లైటింగ్ అందుబాటులో ఉంచినట్లు సీపీ వివరించారు. వీలైనంత తక్కువ మంది నిమజ్జనానికి రావాలని నగరవాలసులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నుంచి నగరంలో ట్రాఫిక్ అంక్షలు ఉంటాయని.. రూట్‌మ్యాప్‌ను విడుదల చేస్తామన్నారు.