నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. సీసీ కెమెరాల ద్వారా సేకరించిన దృశ్యాలు న్యాయస్థానంలో సాక్ష్యాలుగా ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. కార్ఖానా పీఎస్ పరిధిలో ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన 200 సీసీ కెమెరాలను అంజనీ కుమార్ ప్రారంభించారు.
'నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి' - సీపీ అంజనీకుమార్ వార్తలు
హైదరాబాద్లో 3 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో 16వ స్థానాన్ని, దేశంలో 1వ స్థానాన్ని హైదరాబాద్ సొంతం చేసుకుందని పేర్కొన్నారు. కార్ఖానా పీఎస్ పరిధిలో ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన 200 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు.
hyderabad cp
అనంతరం ముడ్ ఫోర్డ్ ఉన్నత పాఠశాల ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. హైదరాబాద్లో 3 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని... ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో 16వ స్థానాన్ని, దేశంలో 1వ స్థానాన్ని హైదరాబాద్ సొంతం చేసుకుందని అంజనీ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి :రాంగోపాల్ వర్మ సినిమాపై హైకోర్టులో వ్యాజ్యం