లాక్డౌన్, కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా విధులు నిర్వహించి కరోనా బారిన పడి.. తిరిగి కోలుకొని విధులకు హాజరవుతున్న పోలీసులను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ప్రశంసించారు. వారికి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందించారు. పాతబస్తీ పేట్ల బుర్జులోని హైదరాబాద్ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ కార్టర్లో కరోనా వ్యాధి నుండి కోలుకుని విధులకు హాజరైన 62 మంది పోలీస్ సిబ్బందికి స్వాగతం, అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్ హాజరయ్యారు.
కరోనాను జయించిన పోలీసులకు సీపీ ప్రశంసలు
విధి నిర్వహణలో ఉండగా.. కరోనా వ్యాధికి గురై.. చికిత్స పూర్తి చేసుకొని, వ్యాధిని జయించి తిరిగి విధులకు హాజరైన పోలీసు సిబ్బందిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అభినందించారు. వారికి ప్రశంస పత్రాలు, బహుమతులు అందజేశారు.
కరోనాను జయించిన పోలీసులకు సీపీ ప్రశంసలు
వైరస్‌ను జయించిన పోలీస్ సిబ్బందిని అభినందించి వారికి ప్రశంస పత్రాలతో పాటు బహుమతులను అందజేశారు, వ్యాధిని జయించిన పోలీస్ సిబ్బంది వారి అనుభవాలను తెలుపుతూ ఉన్నతాధికారులు తమకు అండగా ఉండి.. ధైర్యం చెప్పిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీ అంజనీకుమార్‌తో పాటు హైదరాబాద్ అదనపు సీపీ డీఎస్ చౌహాన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ అధికారులు పాల్గొన్నారు.