తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎన్నికల ఫలితాలు - hyderabad central university

హైదరాబాద్​ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. సుమారు 75 శాతం విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది.

ప్రశాంతంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎన్నికలు

By

Published : Sep 27, 2019, 4:55 AM IST

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన, సంయుక్త, సాంస్కృతిక, క్రీడా కార్యదర్శి పదవుల కోసం 24 మంది పోటీలో ఉన్నారు. ఆఫీస్ బేరర్లతో పాటు... 124 మంది వివిధ స్కూల్ బోర్డుల సభ్యుల ఎన్నిక కోసం పోలింగ్ జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. రాత్రి వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏబీవీపీ, ఓబీసీఎఫ్, ఎస్ఎల్ వీడీ కలిసి కూటమిగా పోటీలో ఉండగా... ఏఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, డీఎస్​యూ, టీఎస్ఎఫ్ మరో కూటమిగా బరిలో నిలిచాయి. ముస్లిం విద్యార్థుల ఫెటర్నిటీ స్వతంత్రంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పోటీ చేసింది. గత ఎన్నికల్లో గెలిచిన ఏబీవీపీ కూటమి... మరోసారి విజయకేతనం ఎగరవేస్తామని ధీమాతో ఉండగా... ఈ సారి తమ కూటమిదే ఆధిక్యత అని ఏఎస్ఏ కూటమి విశ్వాసంతో ఉంది.

ABOUT THE AUTHOR

...view details