తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి ఇల్లు ఒక దేవాలయం కావాలి: అర్చక సంఘాల నేతలు

గణనాథుడి పండగవేళ ప్రతి ఇల‌్లు ఒక దేవాలయం కావాలని హైదరాబాద్‌లోని పలు అర్చక సంఘాల నేతలు ఆకాంక్షించారు. కరోనా వల్ల మండపాల్లో ప్రతిష్ఠించి పూజలు చేయలేకపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనస్సులనే మందిరాలుగా మార్చుకుందామన్నారు.

ప్రతి ఇల్లు ఒక దేవాలయం కావాలి: అర్చక సంఘాల నేతలు
ప్రతి ఇల్లు ఒక దేవాలయం కావాలి: అర్చక సంఘాల నేతలు

By

Published : Aug 21, 2020, 6:05 PM IST

కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే వినాయక చవితి పూజలు నిర్వహించుకోవాలని హైదరాబాద్‌లోని పలు అర్చక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. పండగవేళ ప్రతి ఇల్లు ఒక దేవాలయం కావాలని అర్చక సంఘాల నేతలు ఆకాంక్షించారు. మండపాల్లో ప్రతిష్ఠించి పూజలు చేయలేకపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనస్సులనే మందిరాలుగా మార్చుకుందామన్నారు.

కరోనా కారణంగా అన్ని మతాలు కూడా పండగ వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలని కోరుకుంటున్నాయని వారు తెలిపారు. అందరూ బాగుండాలని ఆ గణపతిని పూజిద్దామని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:'దట్టమైన పొగల వల్లే లోనికి వెళ్లడం కష్టమవుతోంది'

ABOUT THE AUTHOR

...view details