కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ తుది ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 759 మంది సివిల్ సర్వీసెస్ ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్ రెడ్డి జాతీయస్థాయిలో ఏడో ర్యాంకు సాధించాడు. ఆయన ఇప్పటికే ఐఆర్ఎస్ (ఆదాయపన్ను శాఖ సహాయ కమిషనర్) అధికారిగా పని చేస్తున్నారు.
సివిల్స్‌లో మిర్యాలగూడ వాసికి 7వ ర్యాంకు
దేశంలోనే అత్యున్నత స్థాయి హోదా గల సివిల్స్ ఫలితాలు విడదలయ్యాయి. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశవ్యాప్తంగా 759 మందిని సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక చేసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్ రెడ్డి జాతీయస్థాయిలో ఏడో ర్యాంకు సాధించాడు.
కనిషక్ కటారియా మొదటి ర్యాంకరు
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర సర్వీసుల్లోని 782 పోస్టుల కోసం యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు నిర్వహించింది. గత నెల జూన్ 3న జరిగిన ప్రిలిమ్స్‌కు సుమారు మూడు లక్షల మంది హాజరయ్యారు. వారిలో 10వేల 500 మంది మెయిన్స్ పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా 1994 మందిని ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. కనిషక్ కటారియా, అక్షత్ జైన్, జునైద్ అహ్మద్ జాతీయ స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు సాధించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీపాల్ 131,చిరుమావిళ్ల వినయ్ కుమార్ 169, శివ్ నిహారిక సింగ్‌కు 237, అనూషకు 375, అశ్వీజకు 423, వైష్ణవికి 465, మృగేందర్ లాల్ కు 551,బానోతు మృగేందర్‌లాల్ 552, ధీరజ్ కు 559, శ్రీకర్ కు 570, శశికాంత్ కు 695 వ ర్యాంకు దక్కింది.
ఇవీ చూడండి: రైతుల డిమాండ్లను ఈసీకి వివరిస్తాం: రజత్‌కుమార్