తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్​ వ్యవహారంపై ముఖ్యమంత్రి సమీక్షించాలి - తెలంగాణ ఇంటర్​ ఫలితాలు

ఇంటర్మీడియట్​ ఫలితాల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేయించాలని రాష్ట్ర పేరెంట్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు నారాయణ డిమాండ్​ చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి సమీక్షించాలని కోరారు.

ఇంటర్​ వ్యవహారంపై ముఖ్యమంత్రి సమీక్షించాలి

By

Published : Apr 23, 2019, 9:04 PM IST

ఇంటర్మీడియట్​ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేయించాలని రాష్ట్ర పేరెంట్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు నాగటి నారాయణ డిమాండ్​ చేశారు. హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు. ఫలితాల్లో తప్పిదాల వల్ల 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. విద్యారంగం పట్ల ప్రభుత్వ వైఖరేంటో ఇంటర్​ ఫలితాలు చూస్తే తెలుస్తోందన్నారు.

ఇంటర్​ వ్యవహారంపై ముఖ్యమంత్రి సమీక్షించాలి

ABOUT THE AUTHOR

...view details