నిద్రిస్తున్న భార్య పై అనుమానంతో తీవ్రంగా దాడి చేసిన భర్త నిద్రిస్తున్న భార్యపై అనుమానంతో ఓ భర్త దాడి చేసిన ఘటన హైదరాబాద్ శివారు పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పర్వేజ్ , రెహాన బేగం భార్యభర్తలు... వీరికి ముగ్గురు సంతానం. పర్వేజ్ చాంద్రాయణగుట్ట ప్రాంతంలో సైకిల్ పంక్చర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. నిద్రిస్తున్న భార్యపై అనుమానంతో బుధవారం తెల్లవారుజామున మారణాయుధాలతో తీవ్రంగా దాడి చేశాడు.
హుటాహుటిన ఉస్మానియాకు తరలింపు
రక్తపు మడుగులో ఉన్న బాధితరాలి అరుపులు విన్న సోదరుడు హుటాహుటినస్థానికుల సహాయంతో అఫ్జల్గంజ్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పహడీ షరీఫ్ ఠాణాలోఫిర్యాదు చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తల, చెవులపై తీవ్ర గాయాలైన రెహాన అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
తమ వద్ద నుంచి డబ్బులు తీసుకురావాలని అక్కను శారీరకంగా హింసించేవాడని బాధితురాలి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇవీ చూడండి :ఇక్కడ ఎప్పట్నుంచో వీరే పోటీ చేస్తున్నారు